Telangana Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా ముసురు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది. రాజ‌ధాని హైద‌రాబాద్‌లో నిన్న (మంగ‌ళ‌వారం) రాత్రి నుంచి వ‌ర్షం కురుస్తోంది. న‌గ‌రంలోని బాగ్ లింగంప‌ల్లి, దిల్‌సుఖ్ న‌గ‌ర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, నారాయ‌ణ‌గూడ‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట‌, నాంప‌ల్లి హ‌య‌త్‌న‌గ‌ర్, ఎల్బీన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది. జిహెచ్ ఎంసి ప‌రిధిలో ముసురు ప‌ట్టిన వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. హైద‌రాబాద్‌లో అప్పుడ‌ప్పుడు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది. న‌ల్ల‌గొండ ఉమ్మ‌డి జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురుస్తోంది. భువ‌న‌గిరి, సూర్యాపేట‌, న‌ల్ల‌గొండ త‌దిత‌ర ప్రాంతాల్లో వాన‌ప‌డుతోంది.

సిద్దిపేట జిల్లా, వికారాబాద్ జిల్లాలోని ప‌లు చోట్ల వ‌ర్షం కురుస్తోంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప‌లు చోట్ల వాన కురుస్తోంది. ఎల్లారెడ్డి మండ‌లం ల‌క్ష్మాపూర్ వ‌ద్ద క‌ల్వ‌ర్టు తెగిపోయింది. దాంతో ఆ దారిలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.

రాష్ట్రంలో అత్య‌ధికంగా వ‌ర్ష‌పాతం మెద‌క్ జిల్లా టెక్మాల్‌లో కురిసింది. ఇక్క‌డ 19.1 సెం.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. కామారెడ్డి జిల్లా నిజాం సాగ‌ర్‌లో 18 సెం.మీ వ‌ర్షపాతం న‌మోదైంది.

బుధ‌, గురువారం విస్తారంగా వ‌ర్షాలు

అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో తెలంగాణ వ్యాప్తంగా బుధ‌వారం, గురువారం విస్తారంగా వాన‌లు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌కు ఇవాళ (బుధ‌వారం) ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేశారు. మ‌ధ్య తెలంగాణ‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు.

Also Read : Khairatabad Ganesh: ఖైర‌తాబాద్ గ‌ణ‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ తొలిపూజ‌

2 Comments
  1. […] Telangana Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా ముసురు […]

  2. […] Telangana Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా ముసురు […]

Leave A Reply

Your email address will not be published.