కొండా లక్ష్మణ్ బాపూజీకి మంత్రి కెటిఆర్ నివాళులు
హైదరాబాద్ (CLiC2NEWS): స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని మంత్రి కెటిఆర్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..స్వాతంత్య్ర సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. బాపూజీ అందించిన నిస్వార్థ సేవలను కెటిఆర్ స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నార్మక్స్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
