కాల్వలోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి

 నిడ‌మ‌ర్రు (CLiC2NEWS): పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రు మండలం​ మందలపర్రు వద్ద మంగ‌ళ‌వారం ఘోర‌ రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అది గ‌మ‌నించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంట‌నే వారిని బ‌య‌ట‌కు తీసే చ‌ర్య‌లు ప్రారంభించిన పోలీసులు.. మృతిచెందిన వారిని సుమంత్ (35), శరత్‌(28)లుగా గుర్తించారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.