కేంద్ర ప్ర‌భుత్వం అందించే ప‌థ‌కంతో రైతులకు త‌క్కువ వ‌డ్డీకే రూ.3లక్ష‌లు..

MISS:

కేంద్ర ప్ర‌భుత్వం అందించే వ‌డ్డీ రాయితీ ప‌థ‌కం ద్వారా రైతులు త‌క్కువ వ‌డ్డీకే రూ.3ల‌క్ష‌లు రుణం పొంద‌వ‌చ్చు. వ‌డ్డీ రాయితీ ప‌థ‌కం అంటే బ్యాంకులు రైతుల‌కు అందించే రుణాల‌పై విధించే వ‌డ్డీలో కొంత భాగాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. కానీ ఈ ప‌థ‌కం గురించి తెలిసిన‌వారు ఎంద‌రున్నారు. రైతుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డు తో రూ.3ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ తీసుకోవ‌చ్చు. కేవ‌లం 7% వార్షిక వ‌డ్డీకే రైతుల‌కు రుణాల‌ను ఇస్తారు. ఈ రుణాల‌ను రైతులు సకాలంలో చెల్లిస్తే , మ‌రింత రాయితీ అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు కూడా పొంద‌వ‌చ్చు.

ఎవ‌రు అర్హులు అంటే..
కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వారు ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ది పొంద‌వ‌చ్చు.
18 ఏళ్ల వ‌య‌స్సు నుండి 75 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగిన రైతులు అర్హుల‌. సొంత భూమి ఉండి వ్య‌వ‌సాయం చేస్తున్న రైతులు, కౌలు రైతులు, షేర్ క్రాప‌ర్స్‌, లీజు దారులు కూడా ఈ ప‌థ‌కానికి అర్హులే. పాడి రైతులు, చేప‌లు, కోళ్ల రైతులు కూడా ఈ ప‌థ‌కానికి అర్హులే. స‌కాలంలో రుణాన్ని తిరిగి చెల్లించిన రైతుల‌కు అద‌న‌పు వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది. బ్యాంకుల‌నుండి కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ద్వారా రుణాల‌ను అందిస్తున్నారు

రైతులు బ్యాంకుల నుండి ఈ ప‌థకం ద్వారా 7% వ‌డ్డీతో రూ.3ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. రుణం ఇచ్చిన బ్యాంకుల‌కు ప్ర‌భుత్వం 1.5% వ‌ర‌కు వ‌డ్డీ రాయితీ ఇస్తుంది. రైతులు స‌కాలంలో రుణాలు చెల్లిస్తే మ‌రో 3శాతం ప్రోత్సాహ‌కం ల‌భిస్తుంది. అంటే కిసాన్ క్రెడిట్ కార్డు రుణాల‌పై వ‌డ్డీ రేటు 4% త‌గ్గుతుంది. పశు సంవ‌ర్ధ‌కం / మ‌త్స్య ప‌రిశ్ర‌మ కోసం తీసుకున్న రుణాల‌పై రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ రాయితీ వ‌ర్తిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం రైతుల‌కు రుణాల‌ను అందించేందుకు 2006-2007 వార్షిక సంవ‌త్స‌రంలో వ‌డ్డీ రాయితీ ప‌థ‌కాన్ని ప్రారంభించింది. ఈ ప‌థ‌కాన్ని వ‌డ్డీ రాయితీ ప‌థ‌కంగా 2009-10లో స‌వ‌రించింది. అప్ప‌టి నుండి దీన్ని స‌వ‌రించిన వ‌డ్డీ రాయితీ ప‌థ‌కం (Modified Interest Subvention Scheme-MISS) గా పిలుస్తారు. ఈ ప‌థ‌కం 2022-23 నుండి 2024-25 వ‌ర‌కు వ‌ర్తింప జేయ‌గా.. తాజాగా మ‌రోసారి పొడిగించింది 2025-26 సంవ‌త్స‌రానికి కూడా కొన‌సాగిస్తూ కేంద్ర మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.