కాలేజీలలో మితిమీరుతున్న ర్యాగింగ్..
భువనేశ్వర్ (CLiC2NEWS): ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కళాశాలలో ర్యాగింగ్ మితిమీరుతున్నది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ పేరుతో పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ఒడిశాలోని గంజాం జిల్లాలోని బినాయక ఆచార్య కళాశాలలోని డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థినిపై కొందరు సీనియర్లు ర్యాగింగ్ అంటూ లైంగికపరమైన వేధింపులకు పాల్పడ్డారు. విద్యార్థిని అక్కడి నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నించినా కర్రతో బెదిరించి మరీ ఆపారు. పైగా ఇదంతా కొంతమంది సీనియర్ అమ్మాయిలు అక్కడే ఉండి కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో కళాశాల యాజమాన్యం చర్యలు చేపట్టింది. యాంటీ ర్యాగింగ్ కమిటి, క్రమశిక్షణ కమిటి నివేదిక ఆధారంగా 12 మంది విద్యార్థులకు కంపల్సరీ టిసి ఇచ్చి తొలగించింది. వీరిలో ఐదుగురుపై కేసు నమోదు చేశారు.