ఇక నుండి రైళ్లలో మ‌న‌కు న‌చ్చిన ఫుడ్‌..

ఢిల్లీ (CLiC2NEWS): రైళ్ల‌లో ప్ర‌యాణికుల‌కు అందించే ఆహారం విష‌యంలో రైల్వే బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రాంతీయ, స్థానిక వంట‌ల‌కు ప్రాధాన్య‌మిస్తూ.. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ క‌లిగిన వ్య‌క్తులకు వారు కోరే డైట్ పుడ్‌ను అందించనుంది. చిన్నారుల‌కు సైతం కావాల్సిన ఆహారం అందించేందుకు అణుగుణంగా మెనూలో మార్పులు చేసే సౌల‌భ్యాన్ని ఐఆర్‌సిటిసికి క‌ల్పించింది. ప్రాంతాయ వంట‌కాలు, సీజ‌న‌ల్ వంట‌కాల‌తో పాటు, పండుగ దినాల్లో ప్ర‌త్యేక ఆహారాన్ని అందించే విధంగా మెనూలో మార్పులు చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.