సూప‌ర్‌స్టార్‌ కృష్ణ భౌతిక‌కాయానికి సిఎం కెసిఆర్ నివాళి

గొప్ప మిత్రుడిని కోల్పోయా..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌ముఖ న‌టుడు, సూప‌ర్‌స్టార్ కృష్ణ మంగ‌ళ‌వారం తుది శ్వాస విడిచిన విష‌యం తెలిసిన‌దే. ఆయ‌న భౌతికకాయానికి సిఎం కెసిఆర్ నివాళుల‌ర్పించారు. కృష్ణ కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. ప్ర‌ముఖ న‌టుడు కృష్ణ మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. వ్య‌క్తిగతంగా తాను గొప్ప మిత్రుణ్ని కోల్పోయాన‌న్నారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రులు హ‌రీశ్‌రావు, ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపి జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ త‌దిత‌రులు ఉన్నారు.

ఈ ఇంటికి వారి ఆతిథ్యం మేర‌కు చాలా సార్లు వ‌చ్చానన్నారు. అలాగే మంచి విల‌క్ష‌ణ న‌టుడు, పార్ట‌మెంట్ స‌భ్యునిగా కూడా దేశానికి సేవ చేశాడ‌న్నారు. అల్లూరి సీతారామ‌రాజు సినిమా చాలా సార్లు చూశాన‌ని, ఈ సినిమా చాలా బావుంద‌ని చెబితే.. మీరు కూడా సినిమాలు చూస్తారా.. అని కృష్ణ అన్నార‌ని తెలిపారు. దేశ భ‌క్తిని ఉద్భోదించేటువంటి గొప్ప సందేశాత్మ‌ఖ చిత్రాలు నిర్మించార‌న్నారు. ప్ర‌భుత్వం అధికార లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నుంది.

Leave A Reply

Your email address will not be published.