ఐఎన్ ఎస్ విక్రాంత్ పై ప్రధాని దీపావళి వేడుకలు
పనాజి (CLiC2NEWS): ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రధాని మోడీ దీపావళి వేడుకలను సైనిక దళాలతో కలిసి జరుపుకున్నాడు.
ఆదివారం అర్థ రాత్రి గోవా తీరంలోని స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ ఎస్ విక్రాంత్ చేరుకున్న ప్రధాని సోమవారం ఉదయం నేవీ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు… నేవీ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఒక వైపు మహా సముద్రం.. మరోవైపు భారత ధీర జవాన్ల బలం కనిపిస్తోంది… అని అన్నారు. ఈ సందర్భంగా ఐఎన్ ఎస్ విక్రాంత్ సేవలను కొనియాడారు. భారత నౌకా దళానికి ఈ ఐఎన్ ఎస్ విక్రాంత్ ఎంతో బలాన్ని ఇచ్చిందన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ నౌక దాయాది పాక్‌కు నిద్ర పట్టకుండా చేసిందన్నారు.
ఆపరేషన్ సిందూర్ లో పరాక్రమం ప్రదర్శించిన సైనికులకు ఈ సందర్భంగా ప్రధాని మోడీ సెల్యూట్ చేశారు.
Also Read: Happy Diwali: దీపావళి శుభాకాంక్షలు!
INS Vikrant is India’s pride!
This is the largest warship constructed indigenously. I recall the programme in Kochi when it was commissioned. And now, today, I had the opportunity to be here to mark Diwali. pic.twitter.com/FRCh3K7hJ9
— Narendra Modi (@narendramodi) October 20, 2025
[…] […]
[…] […]