ప్ర‌కాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటి విడుద‌ల‌

విజ‌య‌వాడ‌ (CLiC2NEWS): ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో కృష్ణా న‌దికి వ‌ర‌ద నీరు ఉధృతంగా వ‌చ్చి చేరుతోంది. ఎగువ‌న ఉన్న నాగార్జున సాగ‌ర్‌, శ్రీ‌శైలం ప్రాజెక్టుల నుంచి కూడా ప్ర‌కాశం బ్యారేజీకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది.

దీంతో ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద వ‌ర‌ద ఉధృతి గంట‌గంట‌కి పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలో అధికారులు బ్యారీజీ 69 గేట్ల‌ను ఎత్తి నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. బ్యారేజీలోకి భారీగా వ‌ర‌ద నీరు చేరుతోంద‌ని అధికారులు తెలిపారు.

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం బ్యారేజీలోకి 4,29,000 క్యూసెక్కుల నీరు వ‌చ్చిచేరుతుండ‌టంతో అదే స్థాయిలో అధికారులు నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. దీంతో బ్యారేజీ వ‌ద్ద మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేశారు. అలాగే లోత‌ట్టు గ్రామాల ప్రజ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు.

Also Read: 26, 27 తేదీల్లో తెలంగాణ‌లో అతిభారీ వాన‌లు!

Leave A Reply

Your email address will not be published.