19 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు: లోక్‌స‌భ స్పీక‌ర్‌

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఈ నెల (జూలై) 19వ తేదీ నుంచి పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం కానున్నాయ‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా ప్ర‌క‌టించారు. ఈ స‌మావేశాలు జూలై 19 నుంచి ఆగ‌స్టు 13త తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ స‌మావేశాలు మొత్తం 19 ప‌ని రోజుల్లో ఉభ‌య‌స‌భ‌ల కార్య‌క‌లాపాలు జ‌రుగుతాయ‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ ఓంబిర్లా ఇవాళ (సోమ‌వారం) ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో స్పీక‌ర్ మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి వ‌చ్చే ఎంపీలు, మీడియా ప్ర‌తినిధులు అంద‌రినీ పార్ల‌మెంటు లోప‌లికి అనుమ‌తిస్తార‌ని స్పీక‌ర్ స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టికీ వ్యాక్సిన్ వేయించుకోని వారు మాత్రం ద‌య‌చేసి వ్యాక్సిన్‌లు వేయించుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.