Shimla: లోయ‌లోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

సిమ్లా (CLiC2NEWS): హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ లోని చంబా జిల్లాలో ఓ కారు లోయ‌లో ప‌డి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. గురువారం రాత్రి స‌మ‌యంలో కారు 500 మీట‌ర్ల లోతు గ‌ల లోయ‌లో ప‌డిపోయింద‌ని పోలీసులు తెలిపారు.

జిల్లాలోని  టిస్సా స‌బ్ డివిజ‌న్ లోని చాన్వాస్ స‌మీపంలోని ఒక పాఠ‌శాల‌లో విధులు నిర్వ‌హిస్తున్నఉపాధ్యాయుడు త‌న కుటుంబంతో క‌లిసి  బ‌నిఖేట్ నుంచి త‌న ఇంటికి తిరిగి వెళ్తున్న క్ర‌మంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.  వారు త‌మ ఇంటికి కేవ‌లం కిలోమీట‌రు దూరంలో ఉండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

ఉపాధ్యాయుడు రాజేష్‌, భార్య హ‌న్సో (36), కుమార్తె ఆర్తి (17, కుమారుడు దీప‌క్ (15)తో పాటు మ‌రొక‌రు కారులో ఉన్న‌ట్లు స‌మాచారం.

 

భారీ వ‌ర్షాల కార‌ణంగా రోడ్డుకు అడ్డంగా  ఉన్న ఒక రాయికి వాహ‌నం ఢీ కొట్ట‌డంతో కారు లోయ‌లో ప‌డిపోయింద‌ని పోలీసులు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేల్చారు.

విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. కాగా మృత‌దేహాల‌ను వెలికి తీయ‌డానికి దాదాపు 6 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టింది.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: ఎస్‌బిఐలో 6,589 జూనియ‌ర్ అసోసియేట్ పోస్టులు

Leave A Reply

Your email address will not be published.