AP: విదేశాలకు యువతను అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్టు
విశాఖ (CLiC2NEWS): విదేశాలకు మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల పేరుతో రూ.లక్షల్లో జీతం అంటూ ఆశచూపి యువతను మోసం చేసి ఈ ఉచ్చులో దింపుతున్నట్లు సమాచారం. యువతీ యువకులను విదేశాలకు తరలిస్తున్న 22 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు విశాఖ సిపి శంకబ్రత బాగ్చి వెల్లడించారు. ఈ ముఠా చేతుల్లో మోసపోయిన 85 మంది యువతను స్వదేశానికి సురక్షితంగా రప్పించినట్లు తెలిపారు.
కాంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్ వంటి దక్షిణాసియా దేశాలకు మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెల 14వ తేదీన కాంబోడియాకు నలుగురు యువతీ యువకులను డేటా ఎంట్రీ జాబ్ పేరతో పంపించడానికి ప్రయత్నించిన గాజువాక కి చెందని ఏజెంట్ సురేశ్, ఆదిలక్ష్మి లియాస్ ఆనుని విశాఖపట్నం ఎయర్పోర్టులో అరెస్ట్ చేశారు. సురేశ్ ఇదివరకే కాంబోడియాకు వెళ్లి అక్కడ చైనా స్కామ్ కంపెనీలో పనిచేశాడు. అక్కడ విజయ్‌కుమార్ అలియాస్ సన్నీతో పరచయం పెంచుకొని భారత్ కు వచ్చి.. కాంబోడియాలోని సైబర్‌స్కామ్ కంపెనీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను ఇప్పటి వరకు 12 మందిని పంపినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర నుండి దాదాపుయ 500 మంది కాంబోడియా, మయన్మార్ వెళ్లినట్లు సమాచారం.
ఉద్యోగం పేరుతో నిరుద్యోగ యువతే లక్ష్యంగా విదేశాల్లోని చైనా ఆధారిత సైబర్ స్కామ్ కంపెనీల్లో నేరాలు చేసేందుకు వీరిని తరలిస్తున్నారు. అలా తరలించిన వారితో చైనాకు చెందిన పలు స్కామ్ కంపెనీలు ఫేక్ ప్రపైల్ సృష్టించి సోషల్ మీడియాలో టార్గెటెడ్ వ్యక్తులకు ప్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. నమ్మిన వారి నుండి పెట్టుబడులు, టాస్క్ గేమ్స్, డిజిటల్ అరెస్ట్, హనీట్రాప్, ఫిషింగ్ లింక్స్ పద్ధతుల్లో డబ్బులు కాజేస్తారు.