India Corona: భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. క్ర‌మంగా మ‌హ‌మ్మారి వ్యాప్తి అదుపులోకి వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా కొత్త కేసుల న‌మోదు త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 11,56,363 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా..83,876 మందికి పాజిటివ్‌గా తేలింది.

కాగా రోజు వారీగా కేసులు ల‌క్ష‌ల లోపు న‌మోద‌వ్వ‌డం జ‌న‌వ‌రి 6 త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే..

గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశ వ్యాప్తంగా 1,99,054 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో క‌రోనా బారిన ప‌డి 895 మంది మృత్యువాత ప‌డ్డారు. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనాతో 5,02,874 మంది బ‌ల‌య్యారు. ప్ర‌స్తుతం దేశంలో 11,08,938 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.