Kamareddy: రక్తదానంతో తలసేమియా వ్యాధి చిన్నారులను కాపాడాలి
కామారెడ్డి (CLiC2NEWS): రక్తదానంతో తలసేమియా వ్యాధి చిన్నారులను కాపాడాలని జిల్లా ఎస్‌పి రాజేష్ చంద్ర పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సూపరిడెండ్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్లను ఎస్‌పి ఆవిష్కరించారు. కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం వచ్చే సోమవారం 12వ తేదీన, లక్ష్మీ దేవి గార్డెన్స్ లో ఉదయం 09 గంటల నుండి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా స్‌పి రాజేశ్ చంద్ర మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా యువత తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని ఎక్కువ సంఖ్యలో రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు డాక్టర్ బాలు, జమీల్, డాక్టర్ అనీల్, డాక్టర్ వేదప్రకాష్, ఎర్రం చంద్రశేఖర్, గంప ప్రసాద్, పర్ష వెంకటరమణలు పాల్గొన్నారు.
[…] […]