గేట్ స్కోర్‌తో నాల్కో(NALCO) లో 110 పోస్టులు
NALCO: నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌లో 110 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను జనవరి 22వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఒబిసి , ఇడబ్ల్యుఎస్‌లకు రూ.500గా ఉంది. ఇతరులకు రూ.100.
మొత్తం పోస్టులు 110
మెకానికల్ విభాగంలో 59 పోస్టులు, ఎలక్ట్రికల్ విభాగంలో 27 పోస్టులు, కెమికల్ విభాగంలో 24 పోస్టులు కలవు. గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది.
మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ బ్రాంచ్‌తో బిఇ/ బిటెక్ లేదా పిజి , గేట్ -2025 స్కోర్ ఉండాలి.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి శిక్షణ సమయంలో నెలకు రూ.40 వేల నుండి రూ.1,40,000 ఉంటుంది. శిక్షణానంతరం అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి కల్పిస్తారు. దీంతో నెలకు వేతనం రూ.60 వేల నుండ – రూ. 1,80వేల వరకు అందిస్తారు. మూల వేతనంతో పాటు అదనంగా డిఎ, ఉచిత వసతి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పిఆర్‌పి), వైద్య, రిటైర్మెంట్ సదుపాయాలు కూడా చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు. ఒబిసి – నాన్ క్రిమి లేయర్‌లకు మూడేళ్లు, ఎస్‌సి, ఎస్‌టి లకు ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుండ పదిహేనేళ్ల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక: గేట్ – 2025 స్కోర్ మెరిట్‌తో ఒక పోస్టుకు పది మందిని షార్ట్‌లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. గేట్ స్కోర్‌కు 90% వెయిటేజి ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. ఇంటర్వ్యూకు 10% వెయిటేజి ఉంటుంది. ఏడాది పాటు శిక్షణ అనంతరం దేశంలో ఎక్కడైనా పోస్టును ఇస్తారు.
అభ్యర్థులు పూర్తి వివరాలకు https://nalcoindia.com వెబ్‌సైట్ చూడగలరు.
[…] గేట్ స్కోర్‌తో నాల్కో(NALCO) లో 110 పోస్టుల… […]