రైతుల‌కు పంట పెట్టుబ‌డి సాయం విడుద‌ల చేయాల‌ని సిఎం ఆదేశాలు..

రైతుల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని రైతుల‌కు పంట పెట్టుబ‌డి సాయం చెల్లింపుల‌ను ప్రారంభించాల‌ని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు రైతు భ‌రోసా ప‌థ‌కానికి ఇంకా విధివిధానాలు ఖ‌రారు కాలేదు. ఈ నేప‌థ్యంలో ట్రెజ‌రీలో ఉన్న నిధుల విడుద‌ల‌కు సిఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో నూత‌న స‌ర్కార్ పంట పెట్టుబ‌డి సాయం చెల్లింపులు ప్రారంభించ‌నుంది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చింది. రైతుల‌కు, 15 వేలు, కౌలు రైతుల‌కు 12వేలు, వ‌రి పంట‌కు అద‌నంగా రూ.500 బోన‌స్‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత ముందుగా రెండు గ్యారెంటీల‌ను అమ‌లు చేసింది.

Leave A Reply

Your email address will not be published.