ఒక్క‌సారి కూడా ఎన్నిక‌ల్లో పోటీచేయ‌ని రాజ‌కీయ పార్టీల‌పై వేటు..

ఢిల్లీ (CLiC2NEWS): దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ పార్టీగా న‌మోదై ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని రాజ‌కీయ పార్టీల‌పై ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించింది. మొత్తం 345 రాజ‌కీయ పార్టీల‌ను గుర్తించారు. 2019 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డిచిన ఆరేళ్ల‌లో ఒక్క సారి కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని రాజ‌కీయ పార్టీల‌ను గుర్తించి డీలిస్ట్ చేసే ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది. ఆ రాజ‌కీయ పార్టీల‌కు కార్యాల‌యాలు కూడా లేవ‌ని గుర్తించిన ఎన్నిక‌ల సంఘం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఒక రాజ‌కీయ‌ పార్టీ గుర్తింపు పొందాలంటే సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌నీసం 6% ఓట్ల‌ను లేదా నిర్దిష్ట సంఖ్య‌లో సీట్ల‌ను గెల‌వాలి. ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద దాదాపు 2800 గుర్తింపు లేని న‌మోదిత రాజ‌కీయ పార్టీలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.