నేషనల్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, హైదరాబాద్‌లో 61 పోస్టులు
హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో 61 పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
ప్రాజెక్ట్ సైంటిస్ట్ -3 పోస్టులు 4
ప్రాజెక్ట్ సైంటిస్ట్ -2 పోస్టులు 16
ప్రాజెక్ట్ సైంటిస్ట్ -1 పోస్టులు 9
దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోపు పంపించాలి.
ఎంపిక విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు ముందుగా హైదరాబాద్‌లో విధులు నిర్వహించినా.. దేశంలో ఎక్కడికైనా బదిలీ చేసే అవకాశం ఉంది.
అట్మాస్ఫియరిక్ సైన్సెస్/ ఓషనోగ్రఫి/ ఓషన్ ఇంజినీరింగ్ / మీటీయెరాలజి/ ఫిజికల్ ఓషనోగ్రఫి/ క్లయిమేట్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ ఓషన్ మోడలింగ్/ డేటా అనాలిసిస్ / ప్రాసెస్ స్టడీ స్ఏడేళ్ల అనుభవం ఉన్న వారు సైంటిస్ట్ -3 పోస్టులకు అర్హులు . ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 78,000 అందుతుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వ యస్సు 45 ఏళ్లకు మించకూడదు.
ఓషనోగ్రఫి/ ఓషన్ ఇంజినీరింగ్ / మీటీయెరాలజి/ ఫిజికల్ ఓషనోగ్రఫి/ క్లయిమేట్ సైన్సెస్ బిజినెస్ డెవలప్‌మెంట్/ మార్కెటింగ్ , ఫిషరీ రిసోర్సెస్ లేదా ఓషన్ సర్వీసెస్ అనాలిసిస్ / మర్కెట్ స్టడీ కాస్ట్ ఎస్టిమేషన్ లో మూడేళ్ల అనుభవం ఉన్న వారు సైంటిస్ట్ -2 పోస్టులకు అర్హులు . ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు మూల వేతనం రూ. 67,000 అందుతుంది. అభ్యర్థుల వయససు 40 ఏళ్లకు మించకూడదు.
ఓషనోగ్రఫి/ ఓషన్ ఇంజినీరింగ్ / మీటీయెరాలజి/ ఫిజికల్ ఓషనోగ్రఫి/ క్లయిమేట్ సైన్సెస్/ జియో ఇన్ఫర్మేటిక్స్ / మేథమెటిక్స్తో మాస్టర్స్ డిగ్రీ, సంబంధింత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. సైంటిస్ట్ -1 ఉద్యోగానకి ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ. 56వలే అందుతుంది. వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి.
బిఎస్ సి కంప్యూటర్స్ / సైన్స్ / కంప్యూటర్ టెక్నాలజి లేదా బిసిఎ . ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్ / డేటా అనాలసిస్ సాప్ట్ వేర్ / ఎఐ అండ్ ఎంఎల్ / సాప్ట్‌వేర్ అప్లికేషన్ అ/ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పరిజ్ఞానం ఉండాలి. ఈ పోస్టులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 50 ఏళ్లకు మించకూడదు. ఎంపికైన వారికి రూ.20వేల జీతం అందుతుంది.
ప్రాజెక్ట్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 15 పోస్టులు కలవు. ఏదైనా డిగ్రా టైప్ లోయర్/ షార్ట్ హాండ్ లోయర్ / పిజి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ . ఇంగ్లిస్ కమ్యూనికేషన్ నైపుణ్యం, పర్సనల్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ , సెక్రటేరియల్ అసిస్టెన్స్ పరిజ్ఞానం ఉండాలి. రూ.18వేల వరకు వేతనం అందుకోవచ్చు. దీనికి అదనంగా హెచ్ ఆర్ ఎ చెల్లిస్తారు.