రాయ‌చోటిలో ప‌ట్టుబ‌డ్డ నిందితులిద్ద‌రూ ‘అల్ ఉమ్మా’ ఉగ్ర‌వాదులు..

రాయ‌చోటి (CLiC2NEWS): అల్ ఉమ్మా ద‌క్షిణ భార‌త్‌లో అతిపెద్ద ఉగ్ర‌వాద సంస్థ అని.. అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటిలో ప‌ట్టుబ‌డ్డ నిందితులిద్ద‌రూ అల్ ఉమ్మా ఉగ్ర‌వాదుల‌ని క‌ర్నూలు డిఐజి వెల్ల‌డించారు. ఇటీవ‌ల రాయ‌చోటిలో ఉగ్ర‌వాదులు అబూబ‌ర్ సిద్ధిఖీ, మ‌హ్మ‌ద్ అలీని త‌మిళ‌నాడు ఐబి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు దేశంలోని మూడు ప్ర‌ధాన న‌గ‌రాల్లో పేలుళ్ల‌కు కుట్ర ప‌న్నిన‌ట్లు స‌మాచారం. నిందితుల‌ను అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు.

త‌మిళ‌నాడులో జ‌రిగిన వ‌రుస బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఈ ఇద్ద‌రు నిందితులు అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటిలో ప‌ట్టుబ‌డ్డారు. వీరికి స‌హ‌క‌రిస్తున్న వారిపై విచార‌ణ కొన‌సాగుతుంది. త‌మిళ‌నాడు పోలీసులు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ద‌ర్యాప్తు వేగ‌వంతం చేసిన‌ట్లు డిఐజి పేర్కొన్నారు. దాదాపు 50 ఐఇడిలు త‌యారు చేసే సామాగ్రి , పేలుడు ప‌దార్ధాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్‌, అల్ ఉమ్మా ఒకే ర‌క‌మైన భావ‌జాలం క‌లిగి ఉంటాయ‌ని అల్ ఉమ్మా ద‌క్షిణ భార‌త్‌లో అతిపెద్ద ఉగ్ర‌వాద సంస్థ‌. రాయ‌చోటిలో నియామ‌కాలు, శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు విచార‌ణ‌లో నిర్ధ‌ర‌ణ కాలేద‌న్నారు. పేలుడు సామాగ్రి ఎలా వ‌చ్చింద‌నే దానిపై విచార‌ణ చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ఈ కేసుపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప‌నిచేస్తున్నాయ‌ని.. 20 ఏళ్ల‌యినా చ‌ట్టం నుండి త‌ప్పించుకోర‌న‌డానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

ఉగ్ర‌వాదులు టెక్నిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్ అని.. రాయ‌చోటిలో స్థిర‌ప‌డిన త‌ర్వాత 2013లో బెంగ‌ళూరులోని మ‌ల్లేశ్వ‌రంలో జ‌రిగిన పేలుళ్ల‌లో వీరి ప్ర‌మేయం ఉంద‌ని డిఐజి తెలిపారు. నిందితుల‌ వ‌ద్ద నుండి పేలుడు ప‌దార్ధాల‌తో పాటు ప్యూయ‌ల్ ఆయిల్ క‌లిపిన అమ్మోనియం నైట్రేట్ , గ‌న్ పౌడ‌ర్‌లు .. దేశంలోని మూడు ప్ర‌ధాన న‌గ‌రాలు, రైల్వే నెట్‌వ‌ర్క్‌ల మ్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న పేలుడు ప‌దార్ధాలు (సూట్ కేసు బాంబులు, బకెట్ బాంబులు )ను నిర్వీర్యం చేశారు. రాయ‌చోటి డిఎస్‌పి కార్యాల‌యం ప‌క్క‌న అక్టోప‌స్ పోలీసులు నిర్వీర్యం చేశారు.

Leave A Reply

Your email address will not be published.