బాలీవుడ్ న‌టి దీపిక‌కు అరుదైన గౌర‌వం..

Hollywood Walk of Fame Star 2026 : బాలీవుడ్ న‌టి దీపిక ప‌దుకొణెకు అంత‌ర్జాతీయ స్థాయిలో అరుదైన గౌర‌వం ద‌క్కింది. “హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు” ఎంపిక‌య్యారు. ఈ గౌర‌వం ద‌క్కిన తొలి భార‌తీయ న‌టి దీపిక. “హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026″కి మొత్తం 35 మంది ప్ర‌తిభావంతులు ఎంపిక కాగా.. దీపిక ప‌దుకొణె పేరు ఉండ‌టంతో అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. వినోద‌రంగంలో గ‌ణ‌నీయ‌మైన కృషి చేసినందుకు గాను ఈ గౌర‌వం ద‌క్కింది. ఈ మేర‌కు హాలీవుడ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. మోష‌న్ పిక్చ‌ర్స్ విభాగంలో ఆమె ఈ ఘ‌న‌ట‌త‌ను సొంతం చేసుకున్నారు. హాలీవుడ్ తార‌లు డెమి మూర్‌, రాచెల్ మెక్ ఆడ‌మ్స్‌, ఎమిలి బ్లంట్.. ఉన్న జాబితాలో దీపిక పేరు ఉండ‌టం హ‌ర్ష‌నీయం.

దీపిక ప‌దుకొణె.. 2017లో ‘త్రిబుల్ ఎక్స్: ది రిట‌ర్న్ ఆఫ్ జాండ‌ర్ కేజ్‌”తో హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.
2018లొ టైమ్స్ మ్యాగ‌జైన్ విడుద‌ల చేసిన 100 మోస్ట్ ఇన్‌ప్లూయెన్షియ‌ల్ పీపుల్ జాబితాలో ఆమె చోటు ద‌క్కించుకున్నారు. 2022లో పుట్బాల్ ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆవిష్క‌రించారు. 2023 లో జరిగిన ఆస్కార్ వేదిక‌పై కూడా మెరిశారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటునాటు సాంగ్‌ని ఆడియ‌న్స్‌కు ప‌రిచ‌యం చేశారు. ప్ర‌స్తుతం ఆమె అల్లు అర్జున్ , అట్లీ కాంబినేష‌న్‌లో నటించ‌నున్నారు. త‌ర్వాత క‌ల్కి 2898 ఎడి సీక్వెల్‌లో కూడా న‌టించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.