మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
ప్రతీరోజు మేడారానికి బస్సు సౌకర్యం
వరంగల్(CLiC2NEWS): మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ నేటి నుంచి ప్రతీ రోజూ బస్సు సౌకర్యం కల్పించనుంది. సమ్మక్క, సారలమ్మ జాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కవగా ఉంటుందని కొంత మంది భక్తులు కొన్ని రోజులు ముందుగా దర్శనానికి వెళ్లివస్తారు. అలా వెళ్లేవారి కోసం నేటి నుండి ప్రతీ రోజు బస్సు సర్వీసు నడపనున్నట్లు వరంగల్-2 డిపో మేనేజర్ బి.మహేష్ కుమార్ తెలిపారు. 2022 వ సంవత్సరం ఫిబ్రవరి 16 నుండి 18 వరకు మేడారం జాతర జరుగుతుంది.