టెన్త్ త‌ర్వాత రెండేళ్లు బ‌య‌ట ఉంటే స్థానిక‌త కోల్పోతామా?

ఢిల్లీ (CLiC2NEWS): ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత  బ‌య‌ట ఉంటే స్థానిక‌త వ‌ర్తించ‌ద‌న్న స‌ర్కార్‌ ఉత్త‌ర్వులపై  ప‌లువురు  విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిష‌న్‌పై విచారించిన న్యాయ‌స్థానం.. త‌గిన నిబంధ‌న‌లు రూపొందించాల‌ని తీర్పునిచ్చింది. స్థానిక‌త అంటే ఏమిటి? ఎవ‌ర‌కు దీని ప‌రిధిలోకి వ‌స్తారు? అందుకు ఉన్న ప‌రిస్తితులు పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేయాల‌ని హైకోర్టు తీర్పులో పేర్కొంది. దీంతో హైకోర్టు తీర్పును విద్యార్థులు దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో స‌వాల్ చేశారు.

తెలంగాణ స్థానిక‌త వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బిఆర్ గ‌వాయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. న్యాయ‌స్థానంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీ వాద‌న‌లు విపిపించారు. రెండేళ్లు బ‌య‌ట ప్రాంతంలో చ‌దువుకోవ‌డానికి వెళితే త‌ప్పేంట‌ని సిజెఐ ప్ర‌శ్నించారు. ప‌దేళ్లు స్థానికంగా ఉండి.. రెండేళ్లు బ‌య‌ట‌కు వెళితే స్తానిక‌త ఎలా కోల్పోతార‌ని ప్ర‌శ్నించారు. కోటా , దుబాయ్ లాంటి ప్రాంతాల‌కు చ‌దువుకోవ‌డానికి వెళ్లిన విద్యార్థుల‌కు స్థానిక‌త వ‌ర్తించ‌దంటే ఎలా అని ప్ర‌శ్నించారు.ఒక విద్యార్థి తెలంగాణ‌లో పుట్టి పెరిగి, రెండేళ్లు బ‌య‌ట చదువుకున్నంత మాత్రాన కోటా వ‌ర్తించ‌దంటే ఎలా..

2014లో నిబంధ‌న‌లు తీసుకొచ్చార‌ని.. అపుడు ఈ రెండు, నాలుగేళ్ల స‌మ‌యం గురించి అందులో ప్ర‌స్తావించారా అని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. 2024లో తీసుకొచ్చిన నిబంధ‌న‌ను 2028కి వ‌ర్తింప‌జేస్తే స‌రిపోతుంద‌ని సిజెఐ ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. స్థానిక‌త నిబంధ‌న‌ల కార‌ణంగా విద్యార్థుల హ‌క్కుల‌కు అన్యాయం జ‌ర‌కూడ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ప్ర‌తి విద్యార్థి 371డి అధిక‌ర‌ణ గురించి తెలుసుకోవాల‌ని.. నిర‌క్షరాస్యులైన త‌ల్లిదండ్రులు ఉంటే.. 8వ త‌ర‌గ‌తిలోనే రాజ్యాంగం గురించి తెలుసుకోవాల‌న్నట్లు మీ వాద‌న‌లు ఉన్నాయన్నారు.
రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాద‌ది అభిషేక్ సింఘ్వీ.. అస్సాంలో 7 సంవ‌త్స‌రాల నిబంధ‌న ఉంద‌ని గుర్తు చేశారు. వాద‌న‌ల అనంత‌రం తీర్పు రిజ‌ర్వు చేస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం తెలిపింది.

 

Leave A Reply

Your email address will not be published.