`మద్ది` క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
ఏలూరు (): మంగళవారం మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని వేలాది మంది భక్తులు సందర్శించారు. కార్తీక మాసం కావడం.. అందులో మంగళవారం కావడంతో నేడు అంజనేయ స్వామి దర్శనం కోసం భారీగా భక్తలు మద్దికి పోటెత్తారు. ఏలురు జిల్లా జంగారెడ్డి గూడెం మండలం గురవాయిగూడెం మద్ది అంజన్న ఆలయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో విపరీతమైన రద్దీ నెలకొంది.
ఆలయ ముఖ మండపం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి భక్తులు వారి మొక్కులను స్వామి వారికి చెల్లించుకున్నారు. కార్తీక మంగళవారం నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో హనుమాన్నామస్మరణతో మారుమోగింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో జంగారెడ్డి గూడెం సిఐ సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
[…] […]