TS: హ‌స్తిన‌కు చేరుకున్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కెసిఆర్, మంత్రులు, అధికారులు ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ధాన్యం కొనుగోలు విష‌యంపై ప్ర‌ధానిని క‌లవ‌నున్నారు. ధాన్యం ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే పలుసార్లు కేంద్రాన్ని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో కేంద్రంతో తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటా తేల్చాల‌ని కోర‌నున్నారు. బిసి కుల‌గ‌ణ‌న‌పైనా చ‌ర్చించే అవ‌కాశ‌ముంది. సిఎంతోపాటు మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్‌, సిఎస్ సోమేశ్ కుమార్, అధికారులు ఢిల్లీకి వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.