సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు ఉ‌భయ స‌భ‌ల‌ ఆమోదం

Bicameral approval of the Cultivation Laws Repeal Bill

ఢిల్లీ (CLiC2NEWS): మూడు వ్య‌వ‌‌సాయ‌ చ‌ట్టాల ర‌ద్దుకు లోక్ స‌భలో కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ‌మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఆ స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. బిల్లు పై చ‌ర్చ నిర్వ‌హించ‌కుండానే చట్టాల ర‌ద్దు చేసిన‌ట్టు విప‌క్ష స‌భ్యులు ఆరోపించారు. బిల్లు ఆమోదం తెలిపిన కొన్ని గంటల్లోనే రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా దీనిపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని రాజ్య‌స‌భ‌లోనూ విప‌క్షాలు ప‌ట్టుబ‌ట్టాయి. ఇందుకు రాజ్య స‌భ ఛైర్మ‌న్ అనుమ‌తించ‌లేదు. అనంత‌రం మూజువాణి ప‌ద్ధ‌తిలో సాగు చ‌ట్టాల ర‌ద్దుకు సంబంధించిన మూడు బిల్లుల‌కు రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది. ఈ విధంగా వ్యవ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు బిల్లు ఎటువంటి చ‌ర్చ లేకుండానే విప‌క్షాల ఆందోళ‌న‌ల మ‌ధ్య పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు ఆమోదం తెలిపాయి.

Leave A Reply

Your email address will not be published.