వైజాగ్ టు చెన్నై స‌ముద్ర విహార నౌక‌.. విశాఖ‌లో ప్రారంభం

విశాఖ (CLiC2NEWS): న‌గ‌రంలో స‌ముద్ర విహార నౌక‌ను బుధ‌వారం ప్రారంభించారు. విశాఖ‌ప‌ట్ట‌ణం నుండి చెన్నై మ‌ధ్య కార్డేలియా క్రూయిజ్ షిప్‌ను ఎపి మంత్రి కందుల దుర్గేష్‌తో క‌లిసి కేంద్ర‌మంత్రి సోనోవాల్ ప్రారంభించారు. కేంద్ర మంద్రి వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన్నారు. విశాఖ చ‌రిత్ర‌లో అంత‌ర్జాతీయ క్రూయిజ్ ట‌ర్మిన‌ల్ ఒక మైలురాయిగా నిలుస్తుంద‌ని.. రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామ‌ని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ క్రూయిజ్ ట‌ర్మిన‌ల్ ఏర్పాటు చేసినందుకు ఈ సంద‌ర్భంగా విశాఖ పోర్టు అథారిటిని మంత్రి కందుల దుర్గేష్ ప్ర‌శంసించారు.

ఈ రోజు రాత్రి ప్రారంభ‌మైన షిప్ ఈ నెల 5న చెన్నై చేరుకుంటుంది. దాదాపు 600 మంది ప్ర‌యాణించే ఈ షిప్‌లో 11 అంత‌స్తులు ఉన్నాయి. దీనిలోనే ఫుడ్‌, జిమ్, ఫిట్నెస్ సెంట‌ర్లు, స్మిమ్మింగ్ పూల్స్‌, రాక్ క్లెంబింగ్, డాన్స్ షోలు, మ్యూజిక్ షోలు, బార్లు, రెస్టారెంట్లు, లైబ్ర‌రీ సైతం ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.