కామాఖ్యా ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న‌ రాహుల్ గాంధీ

గౌహ‌తి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం గువహతిలోని ప్రసిద్ధ కామాఖ్యా ఆలయాన్ని సందర్శించారు.
వాస్త‌వానికి అస్సాం అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మంగ‌ళ‌వార‌మే ప్ర‌చారం ముగిసింది. అయితే ఇవాళ గౌహ‌తిలోని కామాఖ్యా ఆల‌యాన్ని రాహుల్ విజిట్ చేశారు. కామాఖ్యా అమ్మ‌వారికి పూజ‌లు చేశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడిన రాహుల్, “అస్సాం ఓటర్లకు కాంగ్రెస్ ఐదు హామీలు ఇచ్చింది. మేము బిజెపి కాదు. మేము మా వాగ్దానాలను నెరవేరుస్తున్నాము. టీ గార్డెన్ కార్మికులు రోజుకు కనీస వేతనం రూ .365 అని మా హామీని గుర్తుంచుకోవాలి” అని అన్నారు.

ఇంకా రాహుల్‌.. అస్సాంలో సీఏఏను అమ‌లు చేయ‌మ‌న్నారు. సీఏఏ ద్వారా అస్సామీ భాష‌, సంస్కృతిపై దాడి జ‌రుగుతోంద‌ని రాహుల్ విమ‌ర్శించారు. మేం బీజేపీ త‌ర‌హా కాదు అని, మేం ఇచ్చిన వాగ్ధానాల‌ను నెర‌వేరుస్తామ‌న్నారు. తేయాకు తోట‌ల్లో ప‌నిచేసే కార్మికుల‌కు రోజు క‌నీసం వేత‌నంగా రూ.365 ఇస్తామ‌న్నారు. 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. 39 నియోజ‌క‌వ‌ర్గాల్లో అస్సాం రెండో ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Leave A Reply

Your email address will not be published.