కడపలో ట్రాక్టర్-జీపు ఢీకొనడంతో ఇద్దరు కూలీలు మృతి
పులివెందుల: కడప జిల్లా ముద్దనూరులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా మేరకు.. పులివెందుల పట్టణంలోని ముద్దనూరుకు వెళ్లే రహదారిలో చైతన్య స్కూల్ సమీపాన మున్సిపాలిటీ ట్రాక్టర్, జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా రైతు కూలీలు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. తీవ్ర గాయాలైనవారిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె గ్రామస్థులుగా గుర్తించారు. తీవ్రగాయాలైనవారు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు, రైతు కూలీలుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పాశుద్ధ్య పనులు చేయడానికి వెళ్లూ మృత్యువాత పడిన కూలీలను ఘటనా స్థలంలో చూసిన స్థానికులు విచారం వ్యక్తం చేశారు.
