తెలంగాణలో కొత్త‌గా 101 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: గ‌త 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 101 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే తాజాగా ఒక‌రు క‌రోనాతో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేర‌కు సోమ‌వారం ఉద‌యం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. అలాగే తాజాగా 197 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో న‌మోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,95,682 కు చేరుకోంది. అలాగే 2,92,229 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1611 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1,842 యాక్టివ్‌ కేసులు ఉండగా.. అందులో 751 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది.

link slot

Leave A Reply

Your email address will not be published.