తెలంగాణలో కొత్తగా 518 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 518 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని శుక్రవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 157, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 44, రంగారెడ్డిలో 38, నిజామాబాద్‌లో 29, సంగారెడ్డిలో 21, మహబూబ్‌నగర్‌లో 20, కరీంనగర్‌లో 18 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,309కు చేరాయి. తాజాగా 204 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,99,631 మంది డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల వ్యవధిలో ముగ్గురు వైరస్ బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1683కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,995 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు బులిటెన్‌లో పేర్కొన్నారు.