భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్: పసిడి ప్రియులకు శుభవార్త. ఈ మధ్యకాలంలో తరచూ బంగారం ధరలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. లాక్ డౌన్ సమయంతో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు భారీగా తగ్గుతున్నాయి. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి రూ. 41,700కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.45,490కి చేరింది. ఇక వెండి ధరలు రూ.100 పెరిగి రూ.69,500కి చేరింది.