మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు
ముంబయి: మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో 8,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపిమహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,55,070కు చేరింది. అలాగే తాజాగా
62 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మరణాల సంఖ్య 52,154కు చేరింది. ఈ మేరకు ఆదివారం సాయంత్ర రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. అలాగే గత 24 గంటల్లో 3,753 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 20,24,704కు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,008 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.