ఉమ్మడి `నల్లగొండ`లో విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవు
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన సూర్యాపేటలోని పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఈరోజు అర్థరాత్రి ప్రారంభం కానుంది. జిల్లాలోని చివ్వెంల మండలంలో పెద్దగట్టు (లింగమంతుల స్వామి) జాతర ఘనంగా జరుగనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు.