మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు

ముంబ‌యి: మహా­రా­ష్ట్రలో కోవిడ్‌-19 కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 8,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల‌తో క‌లిపిమహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,55,070కు చేరింది. అలాగే తాజాగా
62 మర­ణాలు సంభ‌వించాయి. తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి రాష్ట్రంలో మర­ణాల సంఖ్య 52,154కు చేరింది. ఈ మేర‌కు ఆదివారం సాయంత్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. అలాగే గత 24 గంటల్లో 3,753 మంది కరోనా రోగులు కోలు­కుని ఆసు­ప­త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలు­కున్న వారి మొత్తం సంఖ్య 20,24,704కు చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,008 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.