`వకీల్ సాబ్` ట్రైలర్ వచ్చేసింది..
హైదరాబాద్: పవన్ కల్యాణ్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `వకీల్‌సాబ్` శ్రుతిహాసన్, నివేదా థామస్, అంజలి అనన్య నాగళ్ల, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. సోమవారం ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. సాధారణంగానే పవన్ సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అలాంటిది మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా.. దాంతో అవి రెండింతలు అయిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత పవన్ అభిమానులు ఎవరూ భూమి మీద లేరు. అంతా గాల్లో తేలిపోతున్నారు. ఇది కదా ఇన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తాము కోరుకున్నది అంటూ ఊగిపోతున్నారు.
బాలీవుడ్లో విజయవంతమైన `పింక్`కి రిమేక్‌గా మార్పులు చేశారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తున్నారు. బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.