సాగర్ పోరు: ఇబ్రహీంపేటలో ఓటు వేసిన నోముల భగత్
హాలియా: నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. కరోనా బాధితులకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ ఉప పోరులో 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇబ్రహీంపేటలో ఓటు వేసిన నోముల భగత్
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్రహీంపేటలో ఓటు వేశారు. వచ్చే నెల 2న ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.