ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం!
చండీగఢ్: పంజాబ్‌లో మహిళలకు సర్కార్ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1 వ తేదీ నుంచి సర్కారు బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు పంజాబ్ ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం చేసే ప్రతిపానకు పంజాబ్ రాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపంది. కాగా మార్చి 5 వ తేదీన బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తామని సిఎం అమరీందర్‌సింగ్ ఇదివరకే హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనకు పంజాబ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఎసి, వోల్వో, ఎతర లగ్జరీ సర్వీసులకు మాత్రం ఉచిత ప్రయాణం వర్తించదని స్పష్టం చేసింది.