స్వల్పంగా తగ్గిన వంటగ్యాస్ ధర
న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో భారీగా పెరిగిన వంటగ్యాస్ ధరలు కాస్త తగ్గాయి. గృహ వినియోగానికి వినియోగించే ఒక్కో సిలిండర్‌పై రూ. 10 తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒసిఎల్) ప్రకటించింది. తగ్గిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.