ఉరేసుకొని కానిస్టేబుల్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండ‌ల శివారులో కానిస్టేబుల్ సైదులు (30) ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. తిరుమేలేశుని గుట్ట స‌మీప‌లంలోని ఓ వెంచ‌ర్‌లో చెట్టుకు కానిస్టేబుల్ ఉరిసేకున్నాడు. దీన్ని గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. మృతుడు మ‌ర్రిగూడ పోలీస్‌స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. అత‌ని స్వ‌స్థ‌లం న‌ల్ల‌గొండ దిండి మండ‌లం ఖానాపూర్ విలేజ్‌, ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.