పట్టణ పిహెచ్సిల పరిధిలో వ్యాక్సినేషన్: ఎపి వైద్య శాఖ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల్లోని అన్ని పట్టణ పిహెచ్సిల పరిధిలో గురువారం వ్యాక్సినేషన్ ప్రారంభించాలని కలెక్టర్లకు ఎపి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకు తగ్గట్టుగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి పట్టణ పిహెచ్సి పరిధిలో ఒక వార్డు సెక్రటేరియట్లో వ్యాక్సినేషన్ ప్రారంభించాలన్నారు. సరిపడా సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని, ఈరోజే లబ్దిదారుల జాబితాను తయారు చేసుకోవాలని సూచించారు.