బాస్కెట్ బాల్ ఆడిన రామ‌చిలుక‌లు

ఎవ‌రైనా ముద్దు ముద్దుగా మాట్లాడితే చిల‌క ప‌లుకులు అంటాము.. ఎందుకంటే చిలుక ప‌లుకులు అంత ముద్దుగా ఉంటాయి. మ‌నం ఇప్పటివ‌ర‌కు కొన్ని ర‌కాల చిలుక‌లు మాట్లాడట‌మే విన్నాం.. కానీ ఆట‌లు ఆడ‌టం ఎప్పుడూ చూడ‌లేదు.. ఆటలంటే ఎదో మామూలు ఆట‌లు కాదు.. ఏకంగా బాస్కెట్ బాల్ ఆట‌.. ఇది మీరు న‌మ్మ‌లేరు క‌దా.. కానీ ఇది నిజం.. ఈ చిట్టిపొట్టి చిలుక‌లు ఎంత చ‌క్క‌గా గోల్ వేస్తున్నాయో..

మీకు ఇంకా న‌మ్మ‌కం క‌ల‌గ‌కుంటే ఇది చ‌దివాక కింద ఉన్న వీడియో చూడండి మీరే న‌మ్మేస్తారు. చిలుక‌లు ముద్దు ముద్దుగా మాట్లాడ‌ట‌మే కాదు.. ఆట‌లు కూడా అద్భుతంగా ఆడ‌గ‌ల‌వ‌ని ఈ 5 రామ చిలుక‌లు నిరూపించాయి. ఈ ఆట చూసిన నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. త‌ప్ప‌దు మ‌రి.. అలా ఉంది వీటి బాస్కెట్ బాల్ ఆట‌..

ఈ వీడియోని తెలంగాణ ఐఎఎస్ అధికార‌ణి హ‌రిచంద‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ వీడియోను వంద‌ల మంది వీక్షించారు. మీరు న‌మ్మ‌లేక పోతే మీరు ఓ లుక్కేయండి.

 

 

Leave A Reply

Your email address will not be published.