శేఖర్ కమ్ముల `సారంగ ద‌రియా`.. సూప‌ర్ రెస్పాన్స్‌!

నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌వ్ స్టోరీ. ఈ సినిమాను ఏప్రిల్ 16న థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తూ మూవీపై అంచ‌నాలు పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా అక్కినేని సమంత విడుదల చేసిన ‘సారంగ దరియా’ పాటకు యూట్యూబ్ లో తెగ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట‌ను స‌మంత త‌న ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేయ‌డం విశేషం.

మంగ్లీ పాడిన ‘సారంగ దరియా’ అనే మాస్ బీట్‌కు సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు వేసింది. విడుదల అయిన అతి కొద్ది గంటల్లోనే 10 లక్షల వ్యూస్ సాధించింది. 161k లైకులను కొట్టేసింది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు.ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు.

Leave A Reply

Your email address will not be published.