ఇంటిలిజెన్స్ బ్యూరోలో 394 పోస్టులు
కేంద్ర హోంశాఖ పరిధలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2 విభాగంలో 394 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా బిఎస్సి ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్ / ఫిజిక్స్ / మ్యాథ్స్ లేదా బిసిఎ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఈనెల 14 లోపు పంపించాల్సి ఉంది.
దరఖాస్తు ఫీజు: యుఆర్, ఇడబ్ల్యుఎస్, ఒబిసిలకు రూ.650. మహిళలు, ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు ఫీజు రూ.550 .
పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారు లెవెల్ -4 వేతన శ్రేణితో మెదటి నెల నుండే రూ. 50వేల వరకు జీతం అందుకోవచ్చు. మూల వేతనం రూ. 25,500.. దీనిపై20% స్పెషల్ సెక్యూరిటి అలవెన్స్, డిఎ, హెచ్ ఆర్ఎ .. కలిపి రూ. 50,000 పొందవచ్చు.
పరీక్షా విధానం..
టైర్-1 ఆబ్జెక్టివ్ టెస్ట్
75 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు.
టైర్ -2 స్కిల్ టెస్టు
దీనికి 30 మార్కులు ఉంటాయి. ఇది ఉద్యోగ నేపథ్యాన్ని బట్టి ఉంటుంది. సాంకేతికాంశాలతో , ప్రాక్టికల్ బేస్డ్గా ఈ పరీక్ష ఉంటుంది.
టైర్ -3 ఇంటర్వ్యూ .. 20 మార్కులు ఉంటాయి.
పూర్తి సమాచారం కొరకు అభ్యర్థులు వెబ్సైట్ https://www.mha.gov.in/ చూడగలరు.
[…] ఇంటిలిజెన్స్ బ్యూరోలో 394 పోస్టులు […]
[…] ఇంటిలిజెన్స్ బ్యూరోలో 394 పోస్టులు […]