24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వ‌ర్షాలు!

హైద‌రాబాద్‌: ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలు, ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపుతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. కాగా… హైదరాబాద్‌లో నిన్న పలు చోట్ల వర్షం కురిసింది. రోడ్లపై వరద పారింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోయింది. కాగా రాగల 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారతవాతావరణ శాఖ శనివారం తెలిపింది.

అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లోని బీహార్, జార్ఖండ్, ఒడిశా ఛత్తీస్‌గఢ్‌, తూర్పు, ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.