470 మంది పిల్లలకు కరోనా పాజిటివ్!
బెంగళూరు: ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు బెంగళూరులో 472 మంది చిన్నపిల్లలకు వైరస్ సోకింది. వీరంతా 10 ఏండ్లలోపు వయసున్నవారు. ముఖ్యంగా పిల్లలు పాఠశాలలకు వెళ్లడం, ఇంటి బయట ఆడుకోవడంతో వైరస్ సోకుతున్నట్లు లైఫ్‌కోర్స్ ఎపిడిమాలజీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ప్రొఫెసర్ గిరిధార చెప్పారు. ఈ నెల 1 నుంచి 26 మధ్య 244 మంది అబ్బాయిలు, 228 మంది బాలికలు కరోనా మహమ్మారి బారిన పడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతంలో రోజుకు 8 నుంచి 9 మంది చిన్నారులు వైరస్ బారినపడేవారు. ఇప్పుడు వారి సంఖ్య 46 కు చేరుకుంది. ఇంకా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. విద్యార్థులను పాఠశాలల్లో దూరం దూరంగా కూర్చోబెట్టినా వాళ్లు ఎక్కువసేపు అలా కూర్చోరని, ఏదో సమయంలో గుమిగూడుతారని, ఇది కూడా వైరస్ వ్యాప్తికి ఓ కారణమని తెలిపారు. అంతేగాక పిల్లలు ఎక్కువ సేపు మాస్క్‌లను ధరించరని ప్రొఫెసర్ గిరిధార గుర్తుచేశారు.