50 అడుగుల లోతైన బావిలో పడిన ఏనుగు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలో ఒక ఏనుగు 50 అడుగుల లోతైన బావిలో పడింది. దానిని రక్షించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అనకంపాయిల్‌ గ్రామంలోని 50 అడుగుల లోతైన బావిలో ఏనుగు పడి ఉండటాన్ని గురువారం సాయంత్రం స్థానికులు గమనించారు. అటవీ శాఖకు సమాచారం ఇవ్వడంతో రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందితో కలిసి ఆ ఏనుగును కాపాడే చర్యలు ప్రారంభించారు. ఒక వ్యక్తికి చెందిన ఆ బావి గట్టును పగులగొట్టి ఏనుగు బయటకు తెచ్చే విధంగా తవ్వకాలు జరుపుతున్నారు. అది కొన్ని రోజుల కిందట బావిలో పడి గాయపడి ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.