వ‌రుస‌గా రెండోసారి ఐపిఎల్ విజేత ఆర్‌సిబి

 

IPL Final RCB vs GT: ఐపిఎల్ 19వ సీజ‌న్ 2026 క‌ప్ ఆర్‌సిబి జ‌ట్టు సొంతం చేసుకుంది. వ‌రుస‌గా 18, 19 సీజ‌న్‌ల‌లో బెంగ‌ళూరు జట్టు క‌ప్‌ను గెలుచుకుంది. ఈ సీజ‌న్ ఫైన‌ల్‌లో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుతో త‌ల‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. గుజ‌రాత్ టైటాన్స్‌పై 3 వికెట్ల తేడాతో ఆర్‌సిబి విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ జ‌ట్టు 155 ప‌రుగులు చేసి, 8 వికెట్లు కోల్పోయింది. అనంత‌రం బ్యాటింగ్ దిగిన ఆర్‌సిబి జ‌ట్టు దూకుడుగా ఆడుతుంది. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్ 32 ప‌రుగులు చేశాడు. పాటిద‌ర్ 15 ప‌రుగులు చేశారు. దేవ్ ద‌త్ , పాండ్య.. ఒక ప‌రుగు తీయ‌గానే ఔట‌య్యారు.

డేవిడ్ 24 ప‌రుగులు చేయ‌గా .. కోహ్లీ 75 ప‌రుగుల‌తో జ‌ట్టు విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాడు.

ఆర్‌సిబి జ‌ట్టు 62 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది. 4.3వ ఓవ‌ర్లో వెంక‌టేశ్ అయ్య‌ర్ 32 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. వెంట‌నే త‌దుప‌రి ర‌న్ తీసే లోపే బెంగుళూరు జ‌ట్టు రెండో వికెట్ కోల్పోయింది. దీంతో 63 ప‌రుగుల వ‌ద్ద దేవ్‌ద‌త్ ఔట‌య్యాడు. 89ప‌రుగులు చేసిన ఆర్‌సిబి మూడ‌వ వికెట్ కోల్పోయింది. 8.2వ ఓవ‌ర్లో పాటిద‌ర్ ఔట‌య్యాడు. 91 ప‌రుగుల‌కు పాండ్య వెనుదిరిగాడు. పాండ్య కేవ‌లం 1 ర‌న్ మాత్ర‌మే చేశాడు. శ‌ర్మ 11 ప‌రుగులు చేశాడు. డేవిడ్ 24 ప‌రుగులు చేయ‌గా .. విరాట్ కోహ్లీ ఆర్ధ శ‌త‌కంతో జ‌ట్టును ముందుకు న‌డిపించాడు.

IPL 19 Season Final: ఆర్‌సిబి ప‌రుగుల లక్ష్యం 156

RCB vs GT: ఐపిఎల్ ఫైన‌ల్ పోరు..

 

Leave A Reply

Your email address will not be published.