ఆర్మీ మ‌హిళా డిగ్రీ కాలేజ్‌లో స్పాట్‌ అడ్మిష‌న్లు

ఈ నెల 27, 29, 30 తేదీల్లో నేరుగా అడ్మిష‌న్ల ప్ర‌క్రియ

పోచంప‌ల్లి (CLiC2NEWS): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ మ‌హిళా కాలేజ్‌లో ప్ర‌వేశాల కొర‌కు స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హిస్తున్నారు. భూదాన్ పోచంప‌ల్లి మండ‌లం దేశ‌ముఖి గ్రామంలో ఉన్న ఆర్మీ మ‌హిళా కాలేజ్‌లో 2026-27 విద్యా సంవ‌త్సరానికి మూడో విడ‌త అడ్మిష‌న్ల ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు. దీనికోసం ఈ నెల 27, 29, 30 తేదీల్లో నేరుగా విద్యార్థులు హాజ‌రు కావాల‌ని ప్రిన్సిపాల్ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. ఈ మూడు రోజుల్లో ఉద‌యం 6 గంట‌ల‌కే విద్యార్థినులు క‌ళాశాల‌కు చేరుకోవాలి. ఫిజిక‌ల్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్ , ఇంట‌ర్వ్యూ అధారంగా అడ్మిష‌న్ల‌ ఎంపిక ఉంటుంది. ఇంట‌ర్మీడియ‌ట్ రెండో సంవ‌త్స‌రం ఉత్తీర్ణులైన విద్యార్థినులు స్పాట్ అడ్మిష‌న్‌కు హాజ‌రువావ‌చ్చు. అన్సి స‌ర్టిఫికెట్‌ల‌ను త‌ప్ప‌కుండా తీసుకురావాల్సి ఉంటుంది. ఫిజిక‌ల్ టెస్ట్ కోసం అభ్య‌ర్థులు నిర్ణీత‌మైన డ్ర‌స్ కోడ్‌లో రావాల్సి ఉంది. అంటే.. విద్యార్థినులు అనుకూల‌మైన ట్రాక్ ప్యాంట్, టీ షర్టు , షూ ధ‌రించి రావాల్సి ఉంటుంది. అభ్య‌ర్థులు క‌నీస ఎత్తు 152 సెంటీమీట‌ర్లు కంటే ఎక్కువ ఉండాలి. ఎలాంటి దృష్టి దోష‌మ‌లు, అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌కూడ‌ద‌ని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.