Vizianagaram: యువతిని పురుగుల మందు తాగమని బ్లాక్‌మెయిల్..!
Vizianagaram: నిశ్చితార్థం కుదిరిన యువతికి పురుగుల మందు ఇచ్చి తాగమని బలవంతం చేశాడు ఓ వివాహితుడు. లేకపోతే మన విషయం చెప్పి పెళ్ళి చెడగొడతానన్నాడు. దీంతో ఆ యువతి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన విజయనగరం (Vizianagaram) జిల్లా గరివిడి మండలం తొండ్రంగి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి.. అదే గ్రామానికి చెందిన రాము నాయుడు అనే వివాహితుడుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. ఇటీవల ఆ యువతికి పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది.
యువతికి పెళ్లి సంబంధం కుదిరిందన్న విషయం రాము నాయుడుకి తెలిసింది. మంగళవారం ఆ యువతి పురుగుల మందు ఇచ్చి తాగమన్నాడు. నువ్వు చావక పోతే, మన విషయం చెప్పి నీ పెళ్లి చెడగొడతానని బెదిరించాడు. దీంతో ఎక్కడ ప్రేమ విషయం బయటకొస్తుందేమో అనే భయంతో పురుగుల మందు తాగేసింది. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి బుధవారం రాత్రి మృతి చెందింది. యువతి చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నారు. మృతిరాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.
Also Read: Gold Prices: దిగివచ్చిన పసిడి ధర..!