Ramagundam: భయం వీడండి… ఫిర్యాదు చేయండి…

మహిళల భద్రతకు అండగా రామగుండం షీ టీమ్స్

Ramagundam Police Commissionerate: ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా మ‌హిళ‌లు భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.  మహిళలు, బాలికల భద్రతకు భరోసాగా రామగుండం షీ టీమ్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని అన్నారు.  పోలీసు శాఖపై, షీ టీమ్స్‌పై విశ్వాసం, భరోసాతో ఉండాల‌న్నారు. మహిళలు, బాలికలు తమపై జరుగుతున్న వేధింపుల గురించి ధైర్యంగా ఫిర్యాదు చేయాల‌న్నారు. ప్ర‌స్తుత ప‌రిస్తితుల్లో ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్‌లో ఒక షీ టీమ్, మంచిర్యాల జోన్‌లో రెండు షీ టీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు.

షీ టీమ్ వాట్సాప్ నంబర్: 6303923700
పెద్దపల్లి జోన్ షీ టీమ్: 8712659386
మంచిర్యాల జోన్ షీ టీమ్: 8712659385

అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు కూడా కాల్ చేయవచ్చని తెలిపారు. మహిళలు, బాలికలు సురక్షిత ప్రయాణం కోసం టీ-సేఫ్ (T-SAFE – ట్రావెల్ సేఫ్) యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. బాధితులు నిర్భయంగా షీ టీమ్స్‌ను సంప్రదించ‌వ‌చ్చ‌ని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచ‌బ‌డ‌తాయ‌ని ఆయన తెలిపారు.

Also Read: బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు క‌న‌బ‌డితే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి

Leave A Reply

Your email address will not be published.